- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదం అంచున మొలంగూర్ చెరువు కట్ట
<p>దిశ, మానకొండూరు: గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని గ్రామాల చెరువు కట్టలకు మరమ్మతులు లేక ఎప్పుడు ప్రమాదం చోటు చేసుకుంటుందో తెలియక గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మొలంగూరు గ్రామ దామర చెరువు వర్షాల తాకిడికి నిండుకుండలా మారింది. అయితే చెరువు కట్టకు మరమ్మతులు లేక ఎప్పుడు గండిపడుతుందోనని దిగువనున్న రైతులు, మత్య్సకారులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలతో ఆనందం వ్యక్తం చేయాలో చెరువు కట్ట తెగిపోయే […]</p>

X
దిశ, మానకొండూరు: గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని గ్రామాల చెరువు కట్టలకు మరమ్మతులు లేక ఎప్పుడు ప్రమాదం చోటు చేసుకుంటుందో తెలియక గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మొలంగూరు గ్రామ దామర చెరువు వర్షాల తాకిడికి నిండుకుండలా మారింది. అయితే చెరువు కట్టకు మరమ్మతులు లేక ఎప్పుడు గండిపడుతుందోనని దిగువనున్న రైతులు, మత్య్సకారులు ఆందోళన చెందుతున్నారు.
వర్షాలతో ఆనందం వ్యక్తం చేయాలో చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని బాధ పడాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెరువు కట్టను క్షేత్రస్థాయిలో పరిశీలించి మరమ్మతులు చేపట్టి రైతులను మత్స్యకారులను కాపాడాలని కోరుతున్నారు.
Next Story






