అద్భుతమైన క్లైమాక్స్‌తో ‘దృశ్యం 3’

by  |
Drishyam 2
X

దిశ, సినిమా: అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ‘దృశ్యం 2’ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. జీతు జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో మోహన్ లాల్ హీరో కాగా.. దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలిపాడు డైరెక్టర్. ‘దృశ్యం 3’ కోసం అద్భుతమైన క్లైమాక్స్ రాశానని.. ఇప్పటికే దీని గురించి హీరో, నిర్మాతలతో చర్చించానని చెప్పారు. అయితే సినిమా ఫ్లోర్స్ మీదకు వెళ్లాలంటే కనీసం మూడేళ్లు పడుతుందన్నారు. స్క్రిప్ట్‌లో కొన్ని విషయాలపై క్లారిటీ రావాల్సి ఉండగా, కొత్తగా ఇంకొన్ని యాడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ అమేజింగ్ క్లైమాక్స్ పొందేందుకు చాలా విషయాలు కలిసి రావాలని, అందుకే ‘దృశ్యం 3’ గురించి హామీ ఇవ్వడం సాధ్యం కాదన్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమాపై జరుగుతున్న చర్చలతో సంతోషంగా ఉన్నామని, అన్ని రకాల విమర్శలను స్వాగతిస్తున్నానని తెలిపారు.


Next Story

Most Viewed