రోజుకు కోటిన్నర వెనకేస్తున్న మోహన్ లాల్‌

by  |
రోజుకు కోటిన్నర వెనకేస్తున్న మోహన్ లాల్‌
X

దిశ, సినిమా: పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులచే ఆదరించడుతోంది. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ‘షో’ను.. తెలుగులో నాగార్జున, తమిళ్‌లో కమల్ హాసన్, కన్నడలో కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తున్నారు. ఇక మలయాళం విషయానికొస్తే సూపర్ స్టార్ మోహన్ లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆయన రెండు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా నడిపించగా.. ఫిబ్రవరి 14 నుంచి థర్డ్ సీజన్ స్టార్ట్ కాబోతోంది. కాగా మొదటి రెండు సీజన్లకు రూ. 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న మోహన్ లాల్.. ఈ సీజన్‌కు రెమ్యునరేషన్ పెంచేశారని టాక్. ఏకంగా రూ. 6 కోట్ల రెమ్యునరేషన్ పెంచేసిన ఈ స్టార్ హీరో.. ప్రస్తుత సీజన్‌కు రూ.18 కోట్లు తీసుకుంటారని తెలుస్తోంది.

మూడు నెలల పాటు ప్రసారమయ్యే షోలో హోస్ట్‌ వీకెండ్స్‌లో మాత్రమే కనిపిస్తారు. అందులోనూ శని, ఆదివారాలకు సంబంధించిన షూటింగ్ ఒకే రోజున జరుగుతుంది. అంటే నెలలో నాలుగు రోజులు మాత్రమే షో కోసం కేటాయిస్తారు. ఇలా మూడు నెలల్లో 12 రోజులు అంటే రోజుకు కోటి రూపాయలు తీసుకునేవారు అన్నమాట. కానీ ఈ సీజన్‌లో రోజుకు రూ. 1.50 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం.


Next Story

Most Viewed