మోహన్‌బాబు మూవీలో 11వ శతాబ్ద గద్యానికి ఇళయరాజా రీమిక్స్

by Jakkula Samataha |

<p>దిశ, సినిమా: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన కెరీర్‌లో ఎన్నో చాలెంజింగ్ రోల్స్ ప్లే చేశారు. ప్రస్తుతం ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా ద్వారా మరో పవర్ ఫుల్ రోల్‌తో వస్తున్న మోహన్ బాబు.. ఈ చిత్రానికి మరింత ప్రత్యేకత ఇచ్చే క్రమంలో మ్యాస్ట్రో ఇళయరాజాను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. అంతే కాదు సాహిత్యంపై పట్టు ఉన్న ఆయన.. 11వ శతాబ్దానికి చెందిన వేదాంత దేశికులు రచించిన రఘువీర గద్యంను ఈ చిత్రంలో రీమిక్స్ చేసేందుకు [&hellip;]</p>

Mohan Babus Son Of India poster
X

దిశ, సినిమా: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన కెరీర్‌లో ఎన్నో చాలెంజింగ్ రోల్స్ ప్లే చేశారు. ప్రస్తుతం ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా ద్వారా మరో పవర్ ఫుల్ రోల్‌తో వస్తున్న మోహన్ బాబు.. ఈ చిత్రానికి మరింత ప్రత్యేకత ఇచ్చే క్రమంలో మ్యాస్ట్రో ఇళయరాజాను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. అంతే కాదు సాహిత్యంపై పట్టు ఉన్న ఆయన.. 11వ శతాబ్దానికి చెందిన వేదాంత దేశికులు రచించిన రఘువీర గద్యంను ఈ చిత్రంలో రీమిక్స్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వీడియోలో మోహన్ బాబు పద్యం పాడటంతో అవాక్కైన ఇళయరాజా.. సినిమాలో కూడా నువ్వే పాడుతావా? అని ప్రశ్నించారు. డైమండ్ రత్నం బాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందిస్తున్నారు. తోటపల్లి సాయినాథ్, డైమండ్ రత్నం బాబు మాటలు సమకూరుస్తున్నారు.

Next Story