రజనీ ద్రోహం చేయలేడు : మోహన్ బాబు

by  |
రజనీ ద్రోహం చేయలేడు : మోహన్ బాబు
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్‌స్టార్ రజనీకాంత్ పొలిటికల్ స్టేట్‌మెంట్‌పై కలెక్షన్ కింగ్, తలైవా ఆప్తమిత్రుడు మోహన్ బాబు స్పందించారు. ఆరోగ్యరీతా పాలిటిక్స్‌లోకి రావట్లేదని ప్రకటించిన రజనీని తాను గతంలోనే రాజకీయాల్లోకి రావొద్దని చెప్పానని తెలిపారు. తన దృష్టిలో అతనొక గ్రేటెస్ట్ పర్సన్ అని.. చీమకు కూడా హాని చేయని వ్యక్తి పాలిటిక్స్ అనే బురదలో అడుగుపెట్టి చెడ్డ పేరు తెచ్చుకోవడం తనకు కూడా ఇష్టం ఉండేది కాదన్నారు మోహన్ బాబు. రజనీకి, తనకు రాజకీయాలు సరిపడవని.. ఎందుకంటే తాము నిక్కచ్చిగా మాట్లాడుతామని, ఎవరికీ ద్రోహం చేయమని అన్నారు. డబ్బులిచ్చి ఓట్లు, సీట్లు కొనలేం.. కొనం కూడా అన్న ఆయన.. ఇక్కడ ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియదన్నారు. రాజకీయాలకు రానంతవరకు మంచి వాడు అన్నవాళ్లే.. రాజకీయాల్లోకి వచ్చాక చెడ్డవాడివని తిడుతారని అభిప్రాయపడ్డారు. రజనీకాంత్ అభిమానులు రజనీకాంత్ అంత మంచివాళ్లని.. తనను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపాడు.

Next Story