మోడల్ స్కూల్ అడ్మిషన్ల గడువు తేది పొడిగింపు

by Chintha Aamani |

<p>దిశ, ఆసిఫాబాద్ : జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరానికి గాను 6 నుండి 10వ తరగతులలో ప్రవేశం కొరకు‌ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయుటకు తుది గడువు తేదిని పొడగించినట్లు తెలుస్తోంది. విద్యార్థులు జూలై 11వ తేదీ వరకు అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ తెలిపారు. ఇదివరకు ప్రకటించిన తేది గడువు ఈ నెల 7న ముగియగా మరో నాలుగు రోజులు అనగా 11వ తేది వరకు [&hellip;]</p>

modle-school
X

దిశ, ఆసిఫాబాద్ : జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరానికి గాను 6 నుండి 10వ తరగతులలో ప్రవేశం కొరకు‌ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయుటకు తుది గడువు తేదిని పొడగించినట్లు తెలుస్తోంది. విద్యార్థులు జూలై 11వ తేదీ వరకు అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ తెలిపారు.

ఇదివరకు ప్రకటించిన తేది గడువు ఈ నెల 7న ముగియగా మరో నాలుగు రోజులు అనగా 11వ తేది వరకు పొడగించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేయుటకు సమీప మీసేవా కేంద్రాలు లేదా ఇంటర్నెట్ సెంటర్లలో సంప్రదించి telanganams.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Next Story