రైతులకు మోదీ గుడ్‌న్యూస్

108

దిశ, వెబ్‌డెస్క్: పీఎం కిసాన్ 8వ విడత సొమ్మును ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. లబ్ధిదారుల జాబితాలో రూ.2 వేల చొప్పున జమ చేశారు. దీని ద్వారా 9.5 కోట్ల మంది లబ్ధి చేకూరనుంది. మొత్తం రూ.19 వేల కోట్లు మోదీ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏపీకి చెందిన రమ అనే మహిళా రైతుతో మోదీ మాట్లాడారు. బంజరు భూములను సాగు భూమిగా మార్చి స్పూర్తిగా నిలిచినందుకు ఆమెకు మోదీ అభినందనలు చెప్పారు. తనకు ప్రభుత్వం ద్వారా వచ్చిన 4 ఎకరాల భూమిలో ప్రకృతి సేద్యం ద్వారా విభిన్నరకాల పంటలు పండించి లాభాలు అర్జించినట్లు మోదీకి రమ తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..