- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరాడంబరంగా లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి వివాహం
<p>న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ వివాహం నిరాడంబరంగా జరిగింది. అత్యంత రహస్యంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తేజస్వి సోదరి రోహణి ఆచార్య నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతూ ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఢిల్లీకి చెందిన యువతితో వివాహం జరిగినట్లు తెలిపారు. కాగా అత్యంత సన్నిహితులైన 50 మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తుంది. లాలూ […]</p>

న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ వివాహం నిరాడంబరంగా జరిగింది. అత్యంత రహస్యంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తేజస్వి సోదరి రోహణి ఆచార్య నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతూ ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఢిల్లీకి చెందిన యువతితో వివాహం జరిగినట్లు తెలిపారు.
కాగా అత్యంత సన్నిహితులైన 50 మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తుంది. లాలూ ప్రసాద్ యాదవ్ తొమ్మిది మంది సంతానంలో తేజస్వి చిన్నవాడు కావడం విశేషం. 32 ఏళ్ల తేజస్వీ ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ‘మాకు చాలా సంతోషంగా ఉంది. లాలూ ప్రసాద్ ఇంటిలో చిన్నవాడైన తేజస్వీకి వివాహం జరిగింది’ అని ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్ వీరేంద్ర అన్నారు. ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో ఘనంగా పెళ్లి చేసుకోవడానికి తేజస్వీ సుముఖత వ్యక్తం చేయలేదని సన్నిహితులు తెలిపారు. కాగా ఈ వివాహానికి యూపీ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యారు.










