మోడ్రన్ గాడ్జెట్స్.. ఇంటి వద్దే ఆరోగ్య పరీక్షలు

265
Modern gadgets

నేటి సమాజంలో తెల్లవారు జామున నిద్ర లేచింది మొదలు ఉద్యోగ, వ్యాపార పనులతో ప్రతి ఒక్కరూ ఉరుకులు, పరుగులు పెట్టడం సహజంగా అందరం చూస్తుంటాం. కొంత మంది ఆర్థిక స్థోమత ఉన్న వారు తమ ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వైద్యులను, ఫ్యామిలీ డాక్టర్లను నియమించుకోవడం చూ స్తుంటాం. కానీ ఇలాంటిది ఎంతో ఖర్చుతో కూడుకున్నది కావడంతో పాటు సమయం కూడా కేటాయించవలసి ఉంటుంది. కానీ నేడు పరిస్థితులు మారాయి. తాజాగా వైద్యుల సహకారం లేకుండా నే జబ్బులను ఇంటి వద్ద ఉండే స్వయంగా పరీక్షలు చేసుకు ని గుర్తించవచ్చు . అంతేకాకుండా వ్యాధులను ముందు గా పసిగట్టేందుకు ప్రత్యేక వైద్య పరికరాలు మార్కె ట్లో అందుబాటులోకి వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది ఇంటి వద్దనే రోగ నిర్ధారణకు , ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు మెడికల్ గాడ్జెట్లు (పరికరాలు) అందుబాటులోకి వచ్చాయి . ఇవి డాక్టర్ల మాదిరిగా ఆరోగ్యం విషయంలో రాబోయే ప్రమాదాన్ని ముందుగా హెచ్చరిస్తున్నాయి.

-దిశ ప్రతినిధి , హైదరాబాద్

కంటిపై ఒత్తిడి తగ్గించేందుకు …

Gunnar Aftex

కంప్యూటర్, సెల్ ఫోన్ , ల్యాప్ ట్యాప్ ల వాడకం పెరిగిపోవడంతో వాటిని వినియోగించే వారి కండ్లపై ఒత్తిడి పెరుగుతుంది . దీన్ని నివారించేందుకు, ఒత్తిడిని తగ్గించేందుకు కండ్లద్దాల తయారీపై పలు కంపెనీలు దృష్టి సారించాయి . ఇందులో భాగంగానే ‘‘ గున్నార్ ఆఫ్టెక్స్ ’’ అనే కంపెనీ లేత పసుపు రంగు కండ్లద్దాలను తయారు చేసింది. వీటిని పెట్టుకుంటే కంప్యూటర్ స్క్రీన్ కారణంగా కళ్లు ఒత్తిడి నుండి పూర్తి ఉపశమనం పొందుతాయి. పైగా వీటిని ఏ ఫ్రేమ్ లో నైనా, ఏ అద్దాలతోనైనా జోడించవచ్చు. ఇది ప్రస్తుతానికి ఆన్ లైన్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి .

నిద్ర కోసం స్లీపింగ్ కిట్…

Withings Aura

ఉదయం నిద్ర లేచింది మొదలు ఉరుకులు, పరుగులు పెట్టే నగర ప్రజలకు కంటి నిద్రపోవడమనేది అతి పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ జాబ్స్ చేసే వారు తమకు కేటాయించిన పనిని పూర్తి చేసేందుకు రాత్రి, పగలు కష్ట పడుతుంటారు. దీంతో వారికి నిద్రపోదామనుకున్నా కునుకురాని పరిస్థితి ఉంటుంది. ఇది మనిషిని నిస్సత్తువ చేసి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇలాంటి సమస్యను దూరం చేసి హాయిగా నిద్రపోయేలా చేసే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి . ‘‘ వితింగ్స్ ఔరా’’ అనే స్లీపింగ్ కిట్ నిద్ర పట్టేలా చేయడంతో పాటు ఎంత గాఢంగా నిద్రపోతున్నామో లెక్కిస్తుంది . మ్యాట్ ను పరుపు కింద పెట్టి మొబైల్ కు అనుసంధానం చేస్తే నిద్ర వివరాలను పంపిస్తుంది . దీంతో పాటు ఉండే అలారం రంగు రంగుల కాంతులను వెదజల్లుతూ నిద్రకు కారణమయ్యే హార్మోన్లను విడుదలయ్యేలా చేస్తుంది. పసందైన సంగీతంతో నిద్ర లేపుతుంది . వీటిని ఆన్ లైన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు .

స్మార్ట్ ఈ ప్యాంట్స్ …

Electrical Underpants

పలు వ్యాధుల కారణంగా మంచానికి పరిమితమైన వారికి కదలిక లేక వారి శరీరంపై పుండ్లు వ్యాపించడం చూస్తుంటాం . అలాంటి వారి కోసం కెనెడా పరిశోధకులు ఎలక్ట్రికల్ అండర్ ప్యాంట్స్ ను రూపొందించారు . ఇవి ప్రతి పదినిమిషాలకు ఎలక్ట్రిక్ చార్జ్ విడుదల చేయడంతో కండరాలలో కదలిక కలిగి రక్త ప్రసరణ జరుగుతుంది . ఈ పరికరం శరీరంపై పుండ్లు పడకుండా చేస్తుంది. దీంతో వ్యాధి తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది.

సూది లేకుండా మధుమేహ పరీక్షలు..

Gluco Track

ఇన్సులిన్ ఇంజెక్షన్లతో తరచూ గ్లూకోజ్ చెకప్ ల కోసం డయాబిటిక్ రోగులకు చేసే పరీక్షల సందర్భంగా చేసే సూదిపోటుతో వారు ఎంతో బాధను అనుభవిస్తుంటారు. దీనిని నియంత్రించేందుకు ఇజ్రాయిల్ కు చెందిన సంస్థ ‘గ్లూకో ట్రాక్’ అనే పరికరాన్ని రూపొందించింది. చెవికి దీనిని తగిలిస్తే ఇందులో ఉండే ప్యాబ్ రక్తంలో ఉండే గ్లూకోజ్ ను సెకన్ల వ్యవధిలో స్క్రీన్ పై చూపిస్తుంది .

హృదయ స్పందనను లెక్కించే స్పార్క్ ట్రాకర్…

spark tracker

గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసే వారు ఇటీవల కాలంలో ఫిట్నెస్ మంత్రం పాటిస్తున్నారు.ఎంత సమయంలో ఎంత దూరం నడిచాం , ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి వంటి వాటిని తెలుసుకునేందుకు పలు యాక్టివిటీ ట్రాకర్లను ధరిస్తున్నారు.స్మార్ట్ ట్రాకర్ కూడా ఇలాంటి పరిక రమే .దీన్ని బ్రేస్ లెట్ , వాచ్, హ్యాండ్ బ్యాగ్, షూస్ లేసులకు కూడా తగిలించవచ్చు. గుండె పనితీరును తెలుసుకోవచ్చు . ముఖ్యంగా వైద్య సేవలు అవసరమున్నది లేనిది కూడా దీనితో తెలుసుకోవచ్చు.

గురకకు చెక్ ….

Anti snore device

నిద్రించే సమయంలో గురక పెట్టే వారు పక్కన ఉంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. గురక కారణంగా సమీపంలో ఉన్న వారు నిద్రలేమితో బాధపడుతుంటారు. వైద్యుల సహాయం అసవరం లేకుండానే గురకకు చెక్ పెట్టేలా ‘‘ యాంటీ స్నోర్ డివైజ్’’ అందుబాటులోకి వచ్చింది . కేవలం నాసికా రంద్రాల్లో వీటిని పెట్టుకుంటే చాలు అవి వ్యాకోచించి గురక రాకుండా చేస్తాయి . అమెజాన్ తదితర సైట్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి . ఇలా ఎన్నో రకాల పరికరాలు అందుబాటులోకి వచ్చినా వీటి గురించి నేటికీ చాలా మందికి తెలియకపోవడం గమనార్హం.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..