- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైరస్ నియంత్రణకు మొబైల్ ర్యాపిడ్ రోబో
<p>దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్-19 బాధిత రోగులకు చికిత్సలో కీలక పాత్ర పోషిస్తోన్న గాంధీ ఆస్పత్రికి బ్యాక్టీరియా, వైరస్‌లను నియంత్రించే యూవీ రోవా బీఆర్ రోబోలను రీవాక్స్ ఫార్మా ప్రైవేటు లిమిటెడ్ అందించింది. ఐసీయూలో ఈ రోబోలతో క్రిమిసంహారక మందు చల్లడం ద్వారా వైరస్‌ను నియంత్రించవచ్చు. 5నిమిషాల్లో ఐసీయూలోని పడకలను, పరిసర ప్రాంతాల్లో శుద్ధి చేయొచ్చు. ఈ రోబోలను మంత్రి కేటీఆర్‌కు శనివారం అందించారు. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ మోహన్ తాయెల్, డైరెక్టర్ జగన్నాథ్ వై, సీఎంవో […]</p>

దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్-19 బాధిత రోగులకు చికిత్సలో కీలక పాత్ర పోషిస్తోన్న గాంధీ ఆస్పత్రికి బ్యాక్టీరియా, వైరస్‌లను నియంత్రించే యూవీ రోవా బీఆర్ రోబోలను రీవాక్స్ ఫార్మా ప్రైవేటు లిమిటెడ్ అందించింది. ఐసీయూలో ఈ రోబోలతో క్రిమిసంహారక మందు చల్లడం ద్వారా వైరస్‌ను నియంత్రించవచ్చు. 5నిమిషాల్లో ఐసీయూలోని పడకలను, పరిసర ప్రాంతాల్లో శుద్ధి చేయొచ్చు. ఈ రోబోలను మంత్రి కేటీఆర్‌కు శనివారం అందించారు. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ మోహన్ తాయెల్, డైరెక్టర్ జగన్నాథ్ వై, సీఎంవో జి.ప్రణయ్ రెడ్డిలు యంత్రాల గురించి వివరించారు. యూవీ రోవా బీఆర్ రోబోను ఆపరేట్ చేయడం చాలా సులువు. ఒక్క బటన్ నొక్కితే చాలన్నారు. త్వరలోనే గాంధీ ఆసుపత్రిలోని ఐసీయూలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆపరేటింగ్ టేబుల్స్, చికిత్సా గదులు, పడకలు, దుస్తులు, వెయిటింగ్ రూములను నిమిషాల్లోనే వైరస్ నియంత్రణ ప్రక్రియను పూర్తి చేయొచ్చునన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. క్రిమి సంహారక రోబోట్‌ను ప్రభుత్వానికి అంకితం చేసినందుకు రీవాక్స్ ఫార్మా ప్రైవేటు లిమిటెడను అభినందించారు. కష్ట కాలంలో సమాజానికి, సమాయానుకూలంగా అందించారని కొనియాడారు. రీవాక్స్ ఫార్మా ప్రైవేటు లిమిటెడ్ చైర్మన్ మోహన్ తాయెల్ మాట్లాడుతూ.. గాంధీ ఆసుపత్రికి అవసరమైన యంత్రాలను అందించడం సంతోషంగా ఉందన్నారు. వైద్య సిబ్బంది, రోగులను వైరస్, బ్యాక్టీరియా నుంచి కాపాడుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. యూవీరోవా బీఆర్, యూవీరోవా ఎస్టీ యంత్రాలను 1700 వాట్ల పవర్ ఓల్టేజీ, 640 వాట్ల యూవీ మోతాదు ఉత్పత్తితో తయారు చేసినట్లు వివరించారు.






