అందులో విలీనం కానున్న మహీంద్రా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ!

by  |
Mahindra
X

దిశ, వెబ్‌డెస్క్: మహీంద్రా అండ్ మహీంద్రా(ఎమ్అండ్ఎమ్) బోర్డు శుక్రవారం మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్‌ను అనుబంధ సంస్థగా విలీనం చేసుకునేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. దీని ద్వారా సంస్థ ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) కార్యకలాపాలను లాస్ట్ మైల్ మొబిలిటీ(ఎల్ఎమ్ఎమ్), ఎలక్ట్రిక్ వెహికల్ టెక్ సెంటర్లతో రెండు కీలక విభాగాలుగా వర్గీకరించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల బిజినెస్ వృద్ధి దశలో ఉంది. భవిష్యత్తులో మరింత వేగవంతంగా వృద్ధి సాధించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ సంస్థకు అవసరమైన వనరులను అందించేందుకు ఈ విలీనం సహాయపడుతుంది.

అలాగే, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ లక్ష్యానికి తోడ్పడుతుందని’ కంపెనీ తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా నిర్మాణాన్ని సరళీకృతం చేస్తూ, కొత్త ఆవిష్కరణలు, సమర్థవంతమైన అమలు, సామర్థ్యం, ఆర్థికవ్యవస్థ మెరుగుదలకు వీలవుతుందని, అదేవిధంగా వాటాదారుల విలువను ప్రతిబింబిస్తుందని కంపెనీ వివరించింది. ‘ఆటోమోటివ్ వ్యాపారంలో ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్తు. దీనికి అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగాన్ని ప్రధాన వ్యాపారంగా మార్చేందుకు సిద్ధంగా ఉండటానికి, ఇందులో పలు ఉత్పత్తులను ఎలక్ట్రిక్ విభాగంలోకి తీసుకురావాలని లక్ష్యంగా ఉన్నామని’ ఎంఅండ్ఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ చెప్పారు.


Next Story

Most Viewed