నిండు గర్భిణీకి ఎమ్మెల్సీ కవిత అండ.. ఆఫర్ ప్రకటించిన క్యాబ్ డ్రైవర్లు

by  |
Pregnant Women
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కవిత చొరవతో ఓ తల్లి ప్రసవ వేదన తీరింది. ఏ ఆటంకం లేకుండా ఓ చిట్టి ప్రాణం ఈ ప్రపంచంలోకి వచ్చింది. కొస్గికి చెందిన జ్యోతిబాయి 9 నెలల గర్భవతి. అయితే డెలివరీ డేట్ కంటే ముందే నొప్పులు రావడంతో పాటు తీవ్ర రక్తస్రావం కావడంతో అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. క్యాబ్ డ్రైవరైన జ్యోతిబాయి భర్తకు ఆ ఆపరేషన్ చేయించడం ఆర్థికంగా భారంగా మారింది. దీంతో జ్యోతి బాయి మరిది ట్విట్టర్ లో సహాయం కోసం అభ్యర్థించాడు. పలువురు స్పందించి కొంత మొత్తం జమచేశారు. కానీ ఆపరేషన్ ఖర్చుకు అది సరిపోదు.

మరోవైపు జ్యోతి బాయి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా మారడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. జ్యోతి బాయి గురించి ఎమ్మెల్సీ కవితకు తెలియడంతో ఆ కుటుంబానికి ఓదార్పు దక్కింది. జ్యోతిబాయి ఆపరేషన్ ఖర్చును భర్తిస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఆమె చొరవతో జ్యోతిబాయికి క్లిష్టమైన ఆపరేషన్ సోమవారం పూర్తైంది. పండండి బిడ్డకు జ్యోతిబాయి జన్మనిచ్చింది. తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలిపి ఎమ్మెల్సీ కవిత సంతోషం వ్యక్తం చేశారు. కవిత స్ఫూర్తితో తాము కూడా ఆపదలో ఉన్నవారికి చేతనైన సాయం చేస్తామని ప్రకటించారు. క్యాబ్ డ్రైవర్లు అయిన వారు ఇక నుంచి తాము గర్భిణులను ఉచితంగా హాస్పిటల్స్ కు తీసుకుపోతామని ప్రకటించారు.


Next Story

Most Viewed