యువతకు ఆదర్శం బాక్సర్ నిక్కత్ జరీన్..

by  |
యువతకు ఆదర్శం బాక్సర్ నిక్కత్ జరీన్..
X

దిశ, నిజామాబాద్ : కష్టపడి బాక్సింగ్‌లో ప్రపంచ స్థాయికి ఎదిగిన నిక్కత్ జరీన్ యువతకు ఆదర్శమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం రాష్ట్రానికి చెందిన బాక్సర్ నిక్కత్ జరీన్‌ తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిక్కత్ జరీన్‌ను కవిత అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

అంతేకాదు ‌నిక్కత్ జరీన్‌‌ను‌ క్రీడలవైపు ప్రోత్సహించిన తల్లిదండ్రులు ‌పర్వీన్, జమీల్‌లను‌ సైతం ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిక్కత్ జరీన్ ప్రతిభను గుర్తించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టాఫ్ ఆఫీసర్ గా ఉద్యోగం కల్పించించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, సాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.



Next Story

Most Viewed