నారాయణపురంలో ప్రముఖ వ్యక్తి బర్త్ డే వేడుకలు

by  |
నారాయణపురంలో ప్రముఖ వ్యక్తి బర్త్ డే వేడుకలు
X

దిశ, మునుగోడు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కౌన్సిల్ విప్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ జన్మదిన వేడుకలు తన స్వగ్రామంలో ఘనంగా నిర్వహించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ శిఖిలమెట్ల శ్రీహరి ఆధ్వర్యంలో చౌరస్తాలో కేక్ కట్ చేసి ప్రభాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నారాయణపురం అభివృద్ధికి నిరంతరం విశ్రామం లేకుండా శ్రమిస్తున్న మన ఎమ్మెల్సీ ఆయురారోగ్యలతో ఉండి మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని సర్పంచ్ అభిప్రాయపడ్డాడు. ఈ కార్యక్రమంలో తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు తెలంగాణ బిక్షం,చిలివేరు శంకర్,జంగయ్య, కొండ గిరి గౌడ్, పాశం క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed