- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్లాష్.. ఫ్లాష్.. తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 6 స్థానాలకు ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. నల్లగొండ, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లా స్థానిక సంస్థలకు ఈ పోలింగ్ జరిగింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల బరిలో టీఆర్ఎస్‌తో పాటు, కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. శుక్రవారం […]</p>

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 6 స్థానాలకు ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. నల్లగొండ, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లా స్థానిక సంస్థలకు ఈ పోలింగ్ జరిగింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ ఎన్నికల బరిలో టీఆర్ఎస్‌తో పాటు, కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 14న వెలువడనున్నాయి. వాస్తవానికి టీఆర్ఎస్‌కు ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ.. పలువురు నేతలు ఇండిపెండెంట్ క్యాండిడేట్‌ల వైపు మొగ్గుచూపుతున్నట్టు వార్తలు రావడంతో విజేత ఎవరనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతోంది.
- Tags
- Mlc elections






