ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసిన రవీందర్ సింగ్.. తర్వాత ఎవరు..?

by  |
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసిన రవీందర్ సింగ్.. తర్వాత ఎవరు..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తన ప్రచారంలో వేగం పెంచుతున్నారు. మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డిని కలిశారు. ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు.

కాంగ్రెస్ అభ్యర్ధి బరిలో లేనందున తనకు అనుకూలంగా ఓట్లు వేయించాలని ఆభ్యర్థించారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బరిలో నిలిచిన తనకు అండగా నిలిచి గెలుపునకు సహకరించాలని కోరారు. ఈ ఇద్దరు లీడర్లు కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్‌కు సాయం చేసే విషయంపై సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.


Next Story