దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ బాలసాని

by  |
దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ బాలసాని
X

దిశ, వాజేడు : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ప్రపంచంలోనే గొప్ప పథకమని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. వాజేడు మండలం జగన్నాథపురం గ్రామంలో నుగూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోదెబోయన బుచ్చయ్య టీఆర్ఎస్ పార్టీ వాజేడు మండల అధ్యక్షులు పెనుమల్లు రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సమక్షంలో అధికార పార్టీలో చేరారు.

సుమారు 35 దళిత కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితులను పట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధికి కృషి చేస్తున్న తీరు, పథకాలను చూసి వారు టీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. ప్రతీ ఒక్క దళిత కుటుంబానికి దళిత బంధు పథకం వర్తింపజేసేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో వాజేడు ఎంపీపీ శ్యామల శారద, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు గొంది రమణారావు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షులు పూసం నరేష్, మండల కో-ఆప్షన్ సభ్యులు ఫేక్ నిజాముద్దీన్, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నరసింహారావు, మండల అధికార ప్రతినిధి చెన్నం ఎల్లయ్య, మండల ప్రచార కార్యదర్శి రాణి మేకల రాంబాబు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు బత్తుల శ్రీనివాసరావు, కొంగల సర్పంచ్ యాలం శివరామకృష్ణ, ఉప సర్పంచ్ సుగంధపు సాంబశివరావు, ఆత్మ డైరెక్టర్ గార నాగార్జున్, టీఆర్ఎస్ పార్టీ కొంగల గ్రామ కమిటీ అధ్యక్షులు బొల్లె ముత్తయ్య, రోడ్డు ప్రసాద్, చెన్నం స్వామి, ఓంకార్, లెగల పెదబాబు, పోలూరి వేణుగోపాల రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed