- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంటతడి పెట్టుకున్న ఉండవల్లి శ్రీదేవి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తనపై కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కంట తడి పెట్టుకున్నారు. తాను జూదాం ఆడించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నంబూరు పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఉండవల్లి శ్రీదేశి అనుచరుడి హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఉండవల్లి శ్రీదేవి.. తనకు పేకాట శిబిరాలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఆ శిబిరం ఉన్న […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తనపై కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కంట తడి పెట్టుకున్నారు. తాను జూదాం ఆడించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నంబూరు పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఉండవల్లి శ్రీదేశి అనుచరుడి హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి.
ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఉండవల్లి శ్రీదేవి.. తనకు పేకాట శిబిరాలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఆ శిబిరం ఉన్న ప్రాంతం తన నియోజకవర్గ పరిధిలోకి రాదని తెలిపారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే జిల్లా ఎస్పీ, ఐజీని కలిసి ఫిర్యాదు చేశానని.. డీజీపీని కలిసి మరోసారి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.
Next Story






