కేసీఆర్, కేటీఆర్ మమ్మల్ని రెచ్చగొట్టకండి.. ఉదయభాను షాకింగ్ కామెంట్స్

by  |
Mla udaya-Bhanu
X

దిశ, వెబ్‌డెస్క్ : నీటి వివాదంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ వాతావరణం హీట్ పుట్టిస్తోంది. తాజాగా పులిచింతల ప్రాజెక్టు వద్ద ఆదివారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న ఏపీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానును సరిహద్దు వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకోవడంతో.. పోలీసులు, ఎమ్మెల్యే ఉదయభాను మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తగా పులిచింతల ప్రాజెక్టు దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జలయజ్ఞంలో భాగంగా పులిచింతల నిర్మించారు. తెలంగాణలోనే వైఎస్ ఎక్కువ ప్రాజెక్టులు కట్టారు. తెలంగాణ మంత్రులు నేతలు వైఎస్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్, కేటీఆర్‌లను మేము విమర్శించకపోయిన మమ్మల్ని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన హితవు పలికారు. అయితే, ప్రాజెక్టుల విషయంలో దేవుడు చెప్పినా వినం అంటూ కేటీఆర్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed