వృద్ధులకు లిఫ్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే..

by  |
వృద్ధులకు లిఫ్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే..
X

దిశ, స్టేషన్ ఘన్‌పూర్ : గమ్యస్థానం చేరేందుకు వాహనాల కోసం ఎదురుచూస్తున్న వృద్ధ దంపతులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య తన కారులో లిఫ్ట్ ఇచ్చారు. బుధవారం స్టేషన్ ఘన్‌పూర్ నుండి లింగాల ఘనపూర్‌కు వెళ్తున్న ఎమ్మెల్యే బస్‌స్టాండ్ వద్ద కూర్చోని ఉన్న వృద్ధులు సింగాపురం సావిత్రి, కొమురయ్యలను చూసి కారు ఆపారు. మీరు ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వెళ్ళాలి అడిగారు.

లాక్‌డౌన్‌లో వాహనాలు ఏవీ రావని చెప్పి వారిని తన కారులో ఎక్కించుకుని గమ్యస్థానానికి చేర్చాడు. ఎమ్మెల్యే చేసిన సాయానికి వృద్ధులు ఆనందం వ్యక్తం చేయడంతో పాటు ధన్యవాదాలు తెలిపారు.



Next Story

Most Viewed