- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్: వివాదస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్..
<p>దిశ ప్రతినిధి , హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ తెలంగాణ ప్రభుత్వంపై మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..”టీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ లో నేను ఈ రోజు హైకోర్టులో కేసు విచారణకు హాజరుకావాల్సి ఉంది, ఎన్నికల సమయంలో అధికార పార్టీ నాయకులపై 20కి పైగా కేసులు నమోదైతే ఆ కేసులన్నింటిని పక్కన పెట్టి నా పై నమోదైన కేసు ఒక్కటి మాత్రమే వేగంగా విచారణ జరుగుతోంది” […]</p>

X
దిశ ప్రతినిధి , హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ తెలంగాణ ప్రభుత్వంపై మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..”టీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ లో నేను ఈ రోజు హైకోర్టులో కేసు విచారణకు హాజరుకావాల్సి ఉంది, ఎన్నికల సమయంలో అధికార పార్టీ నాయకులపై 20కి పైగా కేసులు నమోదైతే ఆ కేసులన్నింటిని పక్కన పెట్టి నా పై నమోదైన కేసు ఒక్కటి మాత్రమే వేగంగా విచారణ జరుగుతోంది” అన్నారు. అంతేకాకుండా ఇతర పార్టీల నాయకులపై పెట్టిన ఎన్నికల కేసులలో కొన్ని విచారణ కూడా ప్రారంభించబడలేదని చెప్పారు. నా ఎన్నికల పిటిషన్ పై ఎందుకు అంత ఆసక్తి చూపుతున్నారో తెలియడంలేదని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. అయితే తనకు చట్టంపై, న్యాయంపై నమ్మకం ఉందని, అందుకే హైకోర్టులో కేసుకు హాజరౌతున్నానని పేర్కొన్నారు.
Next Story






