చిట్టి తల్లీ.. నీకు అండగా నేనుంటా.. ఎమ్మెల్యే అభయహస్తం

by  |
చిట్టి తల్లీ.. నీకు అండగా నేనుంటా.. ఎమ్మెల్యే అభయహస్తం
X

దిశ,మణుగూరు : అమ్మచిట్టి తల్లీ ఎంత చదువుకుంటావో చదువుకో, చదువు నీది..ఖర్చు నాదీ.. అంటూ నిరుపేద కుటుంబానికి చెందిన ఓ గిరిజన మహిళకు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అభయ హస్తం ఇచ్చారు. గురువారం సాయంత్రం మండలంలోని ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలో గుండాల మండలం చీమలగూడెం గ్రామానికి చెందిన సమ్మయ్య, కళావతిల కుమార్తె భవానికి పై చదువుల నిమిత్తం ఎమ్మెల్యే “రేగా”ను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. దీంతో పరిస్థితి అర్థం చేసుకొన్న రేగా యువతరమే నేటి సమాజం.. అంటూ గిరిజన మహిళకు ధైర్యం చెప్పుతూ అండగా నిలిచారు. పై చదువుల నిమిత్తం ఎంత ఖర్చు అయిన నేను భరిస్తా అంటూ గిరిజన కుటుంబానికి హామీ ఇచ్చారు. గిరిజన కుటుంబాలు సంతోషంలో మునిగిపోయాయి. ఈక్రమంలో గిరిజన మహిళకు రేగా చేసిన సహాయంను మండల ప్రజలు, పలువురు మేధావులు అభినందించారు.


Next Story