మెరుగైన వైద్యం అందిచడమే మా లక్ష్యం: ఎమ్మెల్యే పెద్ది

by  |
మెరుగైన వైద్యం అందిచడమే మా లక్ష్యం: ఎమ్మెల్యే పెద్ది
X

దిశ, నర్సంపేట టౌన్: నియోజక వర్గంలోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే 25 సబ్ సెంటర్లను తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సర్కారు వైద్యం మరింత చేరువ చేసేందుకు ఈ సబ్ సెంటర్ లో తీసుకువచ్చామన్నారు. దాదాపు 90% హెల్త్ సబ్ సెంటర్లు అద్దె భవనాల్లో ఉన్నాయని, కరోనా లాంటి తీవ్ర సమస్య తలెత్తినప్పుడు అద్దె భవన యజమానులు ఏఎన్ఎం లను సెంటర్ ఖాళీ చేయాలని తీవ్ర ఒత్తిడి చేయడాన్ని గుర్తు చేశారు.

నియోజకవర్గంలో 59 సబ్ సెంటర్లు ఉండగా 19 సబ్ సెంటర్లకు ఎమ్మెల్యేగా భాద్యతలు తీసుకున్నప్పుడు మంజూరు చేయించామన్నారు. వాటిలో 8 పూర్తి అయి ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు మరో 25సబ్ సెంటర్లు నిర్మాణాల కోసం 4కోట్ల రూపాయలు వైద్య శాఖ అనుమతులు ఇచ్చారన్నారు. భవనాల నిర్మాణానికి స్థలాన్ని సైతం ఎంపిక చేసినట్లు తెలిపారు. సబ్ సెంటర్లు మంజురికి సహకరించిన సీఎం కేసీఆర్ కు, మంత్రి హరీష్ రావుకు, ఆ శాఖ కమిషనర్ వాకటి కరుణకు కృతజ్ఞతలు తెలిపారు.

మంజూరు కాబడిన సబ్ సెంటర్ల వివరాలు

ఖానాపురం మండలం(3)

1. ఖానపురం 2. ధర్మారావుపేట 3.బుధరవుపేట నర్సంపేట మండలం భానోజిపేట పి హెచ్ సి పరిధి (7)
4. మొగ్దుంపురం 5. గురిజాల 6. కమ్మపల్లీ 7.మహేశ్వరం 8.నర్సంపేట(3) 9.ముత్తోజిపేట 10.మాదన్నపేట నెక్కొండ మండలం 11.దిక్షకుంట 12.అప్పల్రావుపేట 13. నెక్కొండ చెన్నారావుపేట మండలం 14. చెన్నారావుపేట 15.కొనపురం 16.ఉప్పరపల్లీ 17.తిమ్మరయుని పహాడ్ 18. పాపయ్యపేట
19. జల్లీ 20.ఏళ్ళయగుడెం దుగ్గొండి మండలం 21.మల్లంపల్లి 22.మందపల్లి 23.తిమ్మంపేట 24. తోగర్రాయి 25. లక్ష్మీపురం

Next Story

Most Viewed