రూల్స్ బ్రేక్: ఇంటికి పిలిపించుకుని వ్యాక్సిన్ వేసుకున్న ఎమ్మెల్యే

122
YCP MLA parvatha Poornachandra Prasad

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఒకవైపు కరోనా విజృంభిస్తుండగా, మరోవైపు వ్యాక్సినేషన్ వేగవంతంగా జరుగుతోంది. దేశవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు సైతం వ్యాక్సిన్‌ను వేసుకుంటున్నారు. తాజాగా నేడు(గురువారం) ప్రధాని నరేంద్ర మోడీ కోవిడ్ టీకా సెకండ్ డోస్ వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ టీకా తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. గురువారం ఆయన పీహెచ్‌సీ సిబ్బందిని ఇంటికి పిలిపించుకొని టీకా తీసుకున్నారు. దీంతో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆస్పత్రికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకుంటే.. ఈ ఎమ్మెల్యే ఇంటికి పిలిపించుకొని టీకా తీసుకోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉందన్న కారణంగానే ఎమ్మెల్యే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..