కేటీఆర్ పేరుతో అడవి: ఎమ్మెల్యే నోముల

by  |
కేటీఆర్ పేరుతో అడవి: ఎమ్మెల్యే నోముల
X

దిశ, నాగార్జున సాగర్ : యువ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీలకు తప్ప ఇతర పార్టీలకు లేదు అని నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల నరసింహ్మయ్య అన్నారు. శుక్రవారం మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా నల్గొండ జిల్లా హలియాలో మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని, రాష్ర్టంలోని ఆలోచనతో పనిచెస్తున్న యువనాయకుడు, డ్తెనమిక్ లీడర్ కేటీఆర్ అని కొనియాడారు. అదేవిదంగా రాష్ర్టాభివృద్ది, ఆదాయం ఏవిధంగా పెంచాలని, ఆలోచించే కేటీఆర్ కలకాలం వర్ధిల్లాలని దేవుడిని కోరుతున్నానన్నారు. కేటీఆర్ పేరుతో నిడమనూరు మండలం గుంటిపల్లిలో గల సోషల్ ఫారెస్ట్ లో 32 ఎకరాల భూమిలో మొక్కలు పెంచుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గోన్నారు.

Next Story