టీఆర్ఎస్‌ పుట్టగతులు లేకుండా పోతుంది : కోమటిరెడ్డి

47

దిశ, మునుగోడు: రాబోయే రోజుల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల ముఖ్య కార్యకర్తల సమావేశం తిరుమలగిరి గ్రామంలో ఆదివారం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ సమస్య ఉన్నా కార్యకర్తలు అధైర్య పడకుండా తనతో చెప్పాలని భరోసా కల్పించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గానికి నిధుల విషయంలో వివక్ష చూపిస్తున్నారని అన్నారు. తెలంగాణలో కొన్ని జిల్లాలనే అభివృద్ధి చేస్తూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాపై వివక్ష చూపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని టీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తారని అన్నారు. అంతేగాకుండా నాంపల్లి మండలంలో ఎంబీబీఎస్ సీటు వచ్చిన హర్షిత శాలిని, బత్తుల లోకేష్‌ను శాలువాతో సన్మానించి అభినందించారు. వీరి చదువు విషయంలో అన్ని రకాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..