గంగవ్వతో సెల్ఫీ తీసుకుని మురిసిపోయిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

368
MLA-Jeevan-Reddy---Gangavva

దిశ, ఆర్మూర్: బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ ఆర్మూర్ లో సందడి చేసింది. పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో బుధవారం ఓ ప్రైవేట్ రెస్టారెంట్ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి గంగవ్వ ముఖ్య అతిథిగా హాజరైంది. రిబ్బన్ కత్తిరించి రెస్టారెంట్ ను ప్రారంభించిన ఆమె పక్కింటి బామ్మలా అచ్చ తెలంగాణ యాసలో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నా, స్థానిక కౌన్సిలర్ ఆకుల రాము, రెస్టారెంట్ యజమాని దామోదర్ తోపాలు పలువురు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని.. గంగవ్వతో సెల్ఫీలు తీసుకుని మురిసిపోయారు.