- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థి చదువుకు ఎమ్మెల్యే ఆర్ధిక సహాయం
<p>దిశ, శేరిలింగంపల్లి: గతంలో తన సొంత ఖర్చులతో ఓ అనాథ అమ్మాయి పెళ్లి చేయడంతో పాటు పలువురు అనాథలకు చేయూతనిస్తున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ, తాజాగా ఓ నిరుపేద విద్యార్థి చదువుకు చేయూతనిచ్చి మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్‌నగర్ బి బ్లాక్‌కు చెందిన సుభద్ర కుమారుడు సుమంత్ అనే పేద విద్యార్థి ఉన్నత చదువులకోసం అవసరమైన ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు చెల్లించారు. గతంలో సుమంత్ తండ్రి చనిపోగా […]</p>

దిశ, శేరిలింగంపల్లి: గతంలో తన సొంత ఖర్చులతో ఓ అనాథ అమ్మాయి పెళ్లి చేయడంతో పాటు పలువురు అనాథలకు చేయూతనిస్తున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ, తాజాగా ఓ నిరుపేద విద్యార్థి చదువుకు చేయూతనిచ్చి మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్‌నగర్ బి బ్లాక్‌కు చెందిన సుభద్ర కుమారుడు సుమంత్ అనే పేద విద్యార్థి ఉన్నత చదువులకోసం అవసరమైన ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు చెల్లించారు.
గతంలో సుమంత్ తండ్రి చనిపోగా వారి ముగ్గురు పిల్లలను దత్తత తీసుకొని, ఉన్నత చదువులు చెప్పిస్తున్నారు. ఇద్దరి ఆడపిల్లల్లో గీత ఇంజనీరింగ్ పూర్తి చేసుకోగా, హర్షిత ప్రస్తుతం పీజీ చదువుతోంది. ఇద్దరు అక్కలను స్ఫూర్తిగా తీసుకుని చక్కగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలని, ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఎమ్మెల్యే గాంధీ ఆకాంక్షించారు. కాలేజీ ఫీజుకు ఆర్థిక సహాయాన్ని అందించిన ప్రభుత్వ విప్ గాంధీకి సుమంత్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.






