- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుబ్బాక లో ఘన విజయం సాధిస్తాం
<p>దిశ, పటాన్‌చెరు: దుబ్బాక ఉప ఎన్నికల్లో లక్ష మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని మిరుదొడ్డి మండల కేంద్రంలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పోరాటాల గడ్డగా పేరొందిన దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, మంత్రి హరీశ్ […]</p>

దిశ, పటాన్‌చెరు:
దుబ్బాక ఉప ఎన్నికల్లో లక్ష మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని మిరుదొడ్డి మండల కేంద్రంలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పోరాటాల గడ్డగా పేరొందిన దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గాన్ని దివంగత శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారని అన్నారు. మరో మారు టీఆర్ఎస్‌కు పట్టం కట్టేందుకు దుబ్బాక ప్రజలు సిద్దంగా ఉన్నారని ఆయన అన్నారు. కార్యకర్తలందరూ సైనికుల్లాగా కృషి చేసి పార్టీ విజయానికి పాటుపడాలని కోరారు.






