అసెంబ్లీలో గండ్ర కీలక ప్రస్తావన.. హామీ ఇచ్చిన మంత్రి

109
MLA Gandra Venkata Ramana Reddy

దిశ, భూపాలపల్లి: చెన్నై నుండి సిరోంచ వరకు నిర్మాణం అవుతున్న జాతీయ రహదారి భూపాలపల్లి పట్టణం మధ్య నుండి వెళుతోన్న విషయం తెలిసిందే. అయితే.. దీంతో భారీ వాహనాలు తిరగడం మూలంగా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలుగుతోందని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. భారీ వాహనాల మూలంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. భూపాలపల్లికి బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని, దానికి సంబంధించిన భూ సేకరణ త్వరగా నిర్వహించి, బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. దీని ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఆర్‌అండ్‌బీ మినిస్టర్‌ను కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందిస్తూ.. పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు గండ్ర తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..