గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి : ఎమ్మెల్యే చల్లా

by  |
గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి : ఎమ్మెల్యే చల్లా
X

దిశ, పరకాల: అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలలో నెలకొన్న సమస్యలు,పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులపై,పారిశుధ్య పనులపై గ్రామాల వారీగా సమీక్షించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, విధుల పట్ల అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గ్రామాలలో పారిశుధ్య పనులు ప్రతిరోజు నిర్వహించాలని, గ్రామంలో పురోగతిలో ఉన్న పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. ఆయా గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. గ్రామాలలో ఆకస్మికంగా పర్యటిస్తానంటూ.. గ్రామాలు పరిశుభ్రంగా లేకుంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని అన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన పూర్తి బాధ్యత గ్రామ సర్పంచ్‌లది అధికారులదేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, పంచాయతి రాజ్ అధికారులు, నీటిపారుదుల శాఖ అధికారులు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed