గ్రామ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి : ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి

104

దిశ, పరకాల: నడికూడ మండలం రాయపర్తి గ్రామంలో తలెత్తిన డ్రైనేజ్ సమస్యను బేషజాలకు పోకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం రాయపర్తి గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. గ్రామంలో తలెత్తిన డ్రైనేజ్ సమస్యను గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. వెంటనే సమస్యపై స్పందిస్తూ గ్రామంలో ఉన్న డ్రైనేజ్ సిస్టం పూర్తి స్థాయిలో లెవెల్స్ వేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా, నష్టం వాటిల్లకుండా సమస్య పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. గ్రామస్తులంతా అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు, టీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..