‘వాటిని భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు నిపుణుడు’

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-06-23 08:02:43  IST  )

<p>దిశ, వెబ్‌ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవస్థలను భ్రష్టుపట్టించడంతో నిపుణుడు అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను వాడుకుని వదిలేయటం చంద్రబాబును వెన్నతో పెట్టిన విద్య అని ఘాటుగా విమర్శించారు. తాజాగా హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస రావులు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌తో రహస్యంగా సమావేశం అయిన అంశం మంగళవారం తెరమీదరకు వచ్చింది. [&hellip;]</p>

‘వాటిని భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు నిపుణుడు’
X

దిశ, వెబ్‌ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవస్థలను భ్రష్టుపట్టించడంతో నిపుణుడు అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను వాడుకుని వదిలేయటం చంద్రబాబును వెన్నతో పెట్టిన విద్య అని ఘాటుగా విమర్శించారు. తాజాగా హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస రావులు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌తో రహస్యంగా సమావేశం అయిన అంశం మంగళవారం తెరమీదరకు వచ్చింది. విషయం తెలిసిన అంబటి మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వంపై బురదచల్లేందుకే చంద్రబాబు వ్యవస్థలను వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ ముగ్గురు కలిసి ఎవరి మీద కుట్రలు చేయడానికి సమావేశం అయ్యారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేయడానికి, వ్యవస్థలను నాశనం చేయడానికి వీరు రహస్యంగా సమావేశం అయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రాజ్యాంగ పదవిలో ఉండటానికి అర్హుడు కాదని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు.

Next Story