- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడ్డా మీద కూలీ కోసం వెళ్లి.. అడవిలో శవమైన మహిళ
<p>దిశ, జవహర్‌నగర్: కూలీ కోసం అడ్డా మీదకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమై.. చివరకు శవమైన ఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ భిక్షపతి రావు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా హిందూపూర్ మండలం, మాగనూరుకు చెందిన మహాదేవ, సుజాత దంపతులు. గత ఆరేండ్లుగా పోలీస్ స్టేషన్ పరిధిలోని భజరంగ్ కాలనీలో నివాసం ఉంటూ.. కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. ఇదే క్రమంలో ఈ నెల 11న […]</p>

దిశ, జవహర్‌నగర్: కూలీ కోసం అడ్డా మీదకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమై.. చివరకు శవమైన ఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ భిక్షపతి రావు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా హిందూపూర్ మండలం, మాగనూరుకు చెందిన మహాదేవ, సుజాత దంపతులు. గత ఆరేండ్లుగా పోలీస్ స్టేషన్ పరిధిలోని భజరంగ్ కాలనీలో నివాసం ఉంటూ.. కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. ఇదే క్రమంలో ఈ నెల 11న ఇంట్లో నుంచి పనికని అడ్డా మీదకు వెళ్లిన సుజాత (35) తిరిగి ఇంటికి రాకపోవడంతో భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా మంగళవారం జవహర్‌నగర్ పరిధి డబుల్ బెడ్రూం ఇండ్ల సమీపంలోని అడవి ప్రాంతంలో మహిళా మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో డీసీపీ రక్షితమూర్తి, ఏసీపీ శివకుమార్, సీఐ బిక్షపతి రావు నేతృత్వంలో క్లూస్ టీమ్, పోలీస్ సిబ్బంది వివరాలు సేకరించే పనిలో పడ్డారు. సంఘటనా స్థలంలో బండరాళ్లతో కొట్టినట్టు ఆనవాళ్లను గుర్తించి హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యాచారం జరిగిందా అన్న కోణంలో విచారణ చేపట్టారు.






