- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023

దిశ, కామారెడ్డి రూరల్ : ఇంట్లో నుంచి కనిపించకుండా పోయి అదృశ్యమైన మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన కామారెడ్డి మండలం దేవునిపల్లి శివారులో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని క్యాశంపల్లి తండాకు చెందిన విస్లావత్ అనిత (35) గత నెల 17న అదృశ్యమైనట్లు కుటుంబీకులు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా దేవునిపల్లి శివారులోని ఓ కంది పంట చేనులో తల, మొండెం వేరు వేరుగా ఉన్న ఓ మహిళా శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. కాగా చనిపోయిన మహిళను గత నెల 17న అదృశ్యమైన విస్లావత్ అనితగా గుర్తించారు. అయితే మహిళపై అత్యాచారం జరిపి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా మృతికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.