ఫస్ట్ భార్య పిల్లలతో సహా రెండో భార్య మిస్సింగ్

113
Missing1

దిశ, చార్మినార్: సోదరి కూతురు వివాహానికి వెళ్లొస్తానని భార్య, కుమారుడు, కుమార్తె అదృశ్యమైన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్​స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట హాషామాబాద్​కు చెందిన మహ్మద్ ​అశ్వాక్​ హస్సేన్​ పాన్ షాప్​ నిర్వాహకుడు. మహ్మద్ అశ్వాక్.. షహనాజ్ బేగం(48)ను రెండవ వివాహం చేసుకున్నాడు. అయితే, ఇతనికి ఇదివరకే పెళ్లియ్యింది. ఒక కూతురు అంజుమ్​ఐరా(12), కుమారుడు మహ్మద్​ అక్బర్​(14) ఉన్నాడు. ఈ నెల 23న జీఎం కాలనీలో సోదరి కూతురు వివాహానికని షహనాజ్​బేగం.. కూతురు అంజుమ్​ఐరా, కుమారుడు మహ్మద్​ అక్బర్ లను తీసుకుని వెళ్లింది. కానీ, ఇప్పటి వరకు తిరిగి రాలేదు. వారి ఆచూకీ కోసం చుట్టు పక్కల బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో భర్త మహ్మద్​ అశ్వాక్ చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..