- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్పత్రిలో వైద్యాధికారుల లీలలు.. మాయమైన లాప్రోస్కోప్ ప్రత్యక్షం
<p>దిశ, వరంగల్:వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో మాయమైన లాప్రోస్కోప్ యంత్రం మంగళవారం అకస్మాతుగా ప్రత్యక్ష్యమైనట్లు సమాచారం. వరంగల్ సీకేఎం అదృశ్యమైనట్లుగా కొద్దిరోజుల క్రితం అధికారులే స్వయంగా ధ్రువీకరించిన విషయం తెలిసిందే. విచారణ చేస్తున్నామని, మరమ్మతులకు పంపించామని అధికారులు పొంతనలేని సమాధానం చెప్పారు. ఈక్రమంలోనే పోలీసులకు కూడా వైద్యాధికారులు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. ఫిర్యాదు చేస్తే అసలు గుట్టు ఎలా బయటకు వస్తుందోననే ఇలా చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలోనే సోమవారం అనుకోనివిధంగా ఆస్పత్రిలో లాప్రోస్కోప్ మిషన్ ప్రత్యక్షమవడం ఆశ్చర్యానికి […]</p>

దిశ, వరంగల్:వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో మాయమైన లాప్రోస్కోప్ యంత్రం మంగళవారం అకస్మాతుగా ప్రత్యక్ష్యమైనట్లు సమాచారం. వరంగల్ సీకేఎం అదృశ్యమైనట్లుగా కొద్దిరోజుల క్రితం అధికారులే స్వయంగా ధ్రువీకరించిన విషయం తెలిసిందే. విచారణ చేస్తున్నామని, మరమ్మతులకు పంపించామని అధికారులు పొంతనలేని సమాధానం చెప్పారు. ఈక్రమంలోనే పోలీసులకు కూడా వైద్యాధికారులు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.
ఫిర్యాదు చేస్తే అసలు గుట్టు ఎలా బయటకు వస్తుందోననే ఇలా చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలోనే సోమవారం అనుకోనివిధంగా ఆస్పత్రిలో లాప్రోస్కోప్ మిషన్ ప్రత్యక్షమవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఇది అదేనా… మరో దానిని తీసుకువచ్చి ఇక్కడ పెట్టారా..? అన్న అనుమానాలు కలిగించేలా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇంటిదొంగలను తప్పించేందుకే వైద్యాధికారులు చాలా ప్రయాసపడిపోతున్నట్లుగా వరంగల్ ప్రజలు ఆరోపిస్తున్నారు.






