- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హమ్మయ్య ఉద్యోగులంతా సేఫ్..
<p>దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లాలో విహార యాత్రకని వెళ్లి కనిపించకుండా పోయిన ఉద్యోగులంతా సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం సదాశివకోన జలపాతాన్ని వీక్షించేందుకు బయలుదేరిన 15 మంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉద్యోగులు కనిపించకుండా పోయారు. వీరంతా నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన వారు. విహారయాత్రకు వెళ్లిన వారికి తోటి ఉద్యోగులు ఫోన్ చేయగా అందరివీ స్విచ్ఛాప్ వచ్చాయి. దాంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఈ విషయం తెలియడంతో తొలుత బాధిత ఫ్యామిలీ మెంబర్స్ ఆందోళనకు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లాలో విహార యాత్రకని వెళ్లి కనిపించకుండా పోయిన ఉద్యోగులంతా సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం సదాశివకోన జలపాతాన్ని వీక్షించేందుకు బయలుదేరిన 15 మంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉద్యోగులు కనిపించకుండా పోయారు. వీరంతా నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన వారు. విహారయాత్రకు వెళ్లిన వారికి తోటి ఉద్యోగులు ఫోన్ చేయగా అందరివీ స్విచ్ఛాప్ వచ్చాయి. దాంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.
ఈ విషయం తెలియడంతో తొలుత బాధిత ఫ్యామిలీ మెంబర్స్ ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అటవీ ప్రాంతానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నిన్నటి నుంచి సెర్చింగ్ కొనసాగుతుండగా ఇవాళ మధ్యాహ్నం ఉద్యోగుల ఆచూకీని కనుగొన్నారు.మొబైల్ సిగ్నల్స్ లేకపోవడం వల్లే వారంతా ఎవరికీ అందుబాటులోకి రాలేకపోయారని పోలీసులు తెలిపారు. కొద్దిసేపటి కిందటే వారిని వడమాలపేట పీఎస్‌కు తీసుకొచ్చారు. మిస్సయిన ఉద్యోగులంతా సురక్షితంగా ఉన్నట్లు తెలియడంతో తోటి ఉద్యోగులతో పాటు, కుటుంబ సభ్యులు సైతం ఊపిరి పీల్చుకున్నారు.






