- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెడ్ రూంలో సెక్స్.. లైవ్ ఇస్తున్న జంట.. అందరూ ఆహ్వానితులే!
<p>దిశ, ఫీచర్స్ : ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లోని మీరా రోడ్ ప్రాంతానికి చెందిన ఒక జంట ‘పేయింగ్ మోడల్’లో ‘లైవ్ సెక్స్’ ప్రసారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ జంటపై సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినా.. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం గమనార్హం. వృత్తిరీత్యా గాయకుడు అయిన ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ఇక డిసెంబర్, 2020లో ఆన్‌లైన్‌లో ‘లైవ్ సెక్స్ స్ట్రీమింగ్’ ప్రకటన చూసిన […]</p>

దిశ, ఫీచర్స్ : ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లోని మీరా రోడ్ ప్రాంతానికి చెందిన ఒక జంట ‘పేయింగ్ మోడల్’లో ‘లైవ్ సెక్స్’ ప్రసారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ జంటపై సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినా.. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం గమనార్హం. వృత్తిరీత్యా గాయకుడు అయిన ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ఇక డిసెంబర్, 2020లో ఆన్‌లైన్‌లో ‘లైవ్ సెక్స్ స్ట్రీమింగ్’ ప్రకటన చూసిన సింగర్ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వృత్తిరీత్యా గాయకుడైన ఓ వ్యక్తిని ఆన్‌లైన్‌లో ‘టీజర్ క్లిప్’ ప్రకటన ఆకర్షించింది. దీంతో లైవ్ సెక్స్ కార్యకలాపాలను ప్రదర్శించే ఈ ఆన్‌లైన్ పోర్న్ ప్లాట్‌ఫామ్‌లో సైన్ అప్ చేసిన ఆయన.. సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించి, కపుల్స్ లైవ్ సెక్స్ యాక్ట్ స్ట్రీమ్ వెబ్ సైట్‌లోకి లాగిన్ అయ్యాడు. ఆ ఇద్దరూ లైంగిక కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడమే కాకుండా వీక్షకుల నుంచి సలహాలను కూడా కోరినట్లు జాతీయ పత్రికలు నివేదించాయి. ఇక ఈ జంట లైంగిక కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఎవరైనా బలవంతం చేశారా? లేక వారి ఇష్టప్రకారమే ఇది జరిగిందా? అని తెలుసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.
ఇటీవల అరెస్టయిన ఓ మహిళ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ సెక్స్ రాకెట్‌తో ఈ ఇద్దరికి సంబంధం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. లాక్ డౌన్ తర్వాత లైంగిక చర్యల లైవ్ స్ట్రీమింగ్ పెరిగిందని.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చాలా మంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. లిబిడో బూస్టర్స్(సెక్స్ మెరుగుదల మాత్రలు) విక్రయించడానికి కూడా లైంగిక చర్యలను ఉపయోగిస్తున్నట్లు వివరించారు.






