నీ పిల్లల్ని చూసైనా బట్టలేసుకోవడం నేర్చుకో.. హీరో భార్యపై నెటిజన్లు ఫైర్

1001

దిశ, సినిమా: బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ భార్య మీరా రాజ్‌పుత్‌ను విపరీతంగా ట్రోలింగ్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఇటీవల పిల్లలతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేసిన ఈ జంట.. టూర్‌ ముగించుకుని తిరిగి వస్తుండగా ముంబై విమానాశ్రయంలో మీడియా కంట పడ్డారు. ఈ మేరకు వీడియో తీసిన మీడియా పర్సన్ సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పిల్లలు, భర్త షాహిద్‌ నిండుగా దుస్తులు ధరించగా.. మీరా మాత్రం డెనిమ్‌ షార్ట్‌ వేసుకొని ఉంది. దీంతో ‘భర్త, చిన్న పిల్లలు కూడా పూర్తిగా బట్టలు ధరించారు. కానీ భార్య మాత్రం పొట్టి బట్టలు వేసుకుంది’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టాడు. ఇక మరొక నెటిజన్ ‘నాకు పురుషులపై రోజు రోజుకి గౌరవం పెరిగిపోతోంది. ఎందుకంటే వారు పూర్తిగా దుస్తులు ధరించి సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. పురుషులందరికీ వందనాలు’ అంటూ చురకలంటించడం విశేషం. ఇక మీరాకి ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ ఉండగా.. ఆమె ట్రోలింగ్‌ గురవ్వడం ఇది మొదటిసారేం కాదు. అయినా ఇంతవరకూ ఒక్కసారి కూడా నెటిజన్లకు రిప్లై ఇవ్వలేదు మీరా.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..