- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీ అర్వింద్‌పై మైనార్టీల ఆగ్రహం..
<p>దిశ, అచ్చంపేట : హుజరాబాద్ ఎన్నికల ప్రచారంలో ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుని తీరుకు నిరసనగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో ముస్లిం మైనార్టీల అధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్దా ఎంపీ అరవింద్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ.. ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా తన వ్యాఖ్యలు ఉన్నాయని ఆయనపై మండిపడ్డారు. అనంతరం అచ్చంపేట పట్టణ […]</p>

దిశ, అచ్చంపేట : హుజరాబాద్ ఎన్నికల ప్రచారంలో ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుని తీరుకు నిరసనగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో ముస్లిం మైనార్టీల అధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్దా ఎంపీ అరవింద్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ.. ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా తన వ్యాఖ్యలు ఉన్నాయని ఆయనపై మండిపడ్డారు.
అనంతరం అచ్చంపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ ప్రదీప్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు మహబూబ్ అలీ, ఖాజా, అహ్మద్ పటేల్, సాదిక్, ఎండీ గౌస్ పాష, ఖాదర్, బాబా, ఇసాక్, బోటు, చోట, ఖాజా, అమీన్ యబ, మక్బూల్, మోయిజ్, ఫాయుం, అషు, అన్వర్, జాగింగీర్, సాజిద్, అమీర్, యేజస్, జమీర్, సాజిద్, గౌస్, బీసీ సంఘం నాయకులు కాషన్న యాదవ్, మాజీ సర్పంచ్ హరీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.






