- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిరిసిల్లలో దారుణం.. గర్భం దాల్చిన మైనర్
<p>దిశ, సిరిసిల్ల : అభం శుభం తెలియని ఓ మైనర్ బాలికపై(14) ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మాయమాటలతో బాలికను లొంగదీసుకుని ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రాశిగుట్ట తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రాశిగుట్ట తండాకు చెందిన బాధిత బాలిక ప్రతీరోజు మేకలు కాయడానికి గ్రామ శివారులోని అడవి ప్రాంతానికి వెళ్తుంది. అయితే ఆమెపై కన్నేసిన అదే తండాకు చెందిన రమావత్ రమేష్(28), భూక్య గోవింద్(30) […]</p>

దిశ, సిరిసిల్ల : అభం శుభం తెలియని ఓ మైనర్ బాలికపై(14) ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మాయమాటలతో బాలికను లొంగదీసుకుని ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రాశిగుట్ట తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రాశిగుట్ట తండాకు చెందిన బాధిత బాలిక ప్రతీరోజు మేకలు కాయడానికి గ్రామ శివారులోని అడవి ప్రాంతానికి వెళ్తుంది.
అయితే ఆమెపై కన్నేసిన అదే తండాకు చెందిన రమావత్ రమేష్(28), భూక్య గోవింద్(30) అనే ఇద్దరు యువకులు బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నారు. రెండు నెలలుగా బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం బయటపడింది. దీంతో బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువకులపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ గౌడ్ తెలిపారు.






