బాలికపై టీఆర్ఎస్ లీడర్ అఘాయిత్యం..

by  |
బాలికపై టీఆర్ఎస్ లీడర్ అఘాయిత్యం..
X

దిశ, కామారెడ్డి : అతను అధికార పార్టీలో మైనార్టీ నేతగా కొనసాగుతున్నాడు. ఆ అమ్మాయికి వరుసకు మామ అవుతాడు. తల్లి ఉన్నప్పటి నుంచి ఆ కుటుంబానికి ఆసరాగా అప్పుడప్పుడు వచ్చి బాగోగులు చూస్తున్నాడు. ఇటీవల అమ్మాయి తల్లి చనిపోవడంతో అప్పుడప్పుడు ఇంటికి వస్తుపోతూ ఉండేవాడు. ఇదే క్రమంలో ఆ అమ్మాయిపై అతనికి కామవాంఛ మొదలైంది. ఎలాగైనా ఆమెను వశపరుచుకోవాలని భావించాడు. ఓ రోజు ఇంటినుంచి అమ్మాయిని కామారెడ్డికి తీసుకువచ్చి ఓ ఇంట్లో ఉంచాడు. తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తాను అని అమ్మాయిని బెదిరించాడు. కోరిక తీరాక అమ్మాయిని గంభీరావుపేటలో వదిలేసాడు. ఆ అమ్మాయి మైనర్. ప్రస్తుతం పదవతరగతి చదువుతోంది. జరిగిన ఘటనను బంధువులకు చెప్పింది.

అనంతరం అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం.. మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఓ మైనర్ అమ్మాయి పదోతరగతి చదువుతోంది. జిల్లా కేంద్రంలో నివాసముండే టీఆర్ఎస్ నాయకుడు ఆసీఫ్ అనే యువకుడు ఆ అమ్మాయికి వరుసకు మామ అవుతాడు. గత కొద్దికాలంగా అమ్మాయి కుటుంబానికి సంబందించిన మంచి చెడులు చూస్తున్నాడు. ఇటీవల అమ్మాయి తల్లి చనిపోవడంతో అమ్మాయిపై కన్నేసిన ఆసీఫ్ ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని రెండు రోజుల క్రితం కామారెడ్డికి తీసుకువచ్చాడు. ఓ ఇంట్లో బంధించి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి అమ్మాయిని గంభీరావుపేటలో వదిలిపెట్టాడు. బుధవారం ఆ అమ్మాయి మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఆసీఫ్ పై అత్యాచారం కేసు పెట్టింది. దాంతో ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు విచారణ చేపడుతున్నారు.

పోలీసుల అదుపులో నిందితుడు..

అత్యాచారానికి పాల్పడిన టీఆర్ఎస్ నేత ఆసీఫ్ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. అమ్మాయి ఫిర్యాదు చేయగానే విచారణ నిమిత్తం ఆసీఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అలాగే గురువారం సాయంత్రం ఆసీఫ్‌ను కోర్టులో హాజరు పరిచినట్టు సమాచారం. పోలీసులు మాత్రం విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని కామారెడ్డి రూరల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed