- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువతి కిడ్నాప్.. ఆపై గ్యాంగ్ రేప్
<p>దిశ,వెబ్ డెస్క్: దేశంలో అమ్మాయిలకు రక్షణలేకుండా పోయింది. కామంతో కళ్లుమూసుకుపోయిన కొందరు దుండగులు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే త్రిపుర రాష్ట్రంలో వెలుగుచూసింది. కొవాయ్ జిల్లాలోని ఖాసియమంగల్ ఏరియాకి చెందిన 17 ఏళ్ల యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించిన కామాంధులు ఆమెను కిడ్నాప్ చేశారు.. బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. అడవిలో నిస్సహాయ స్థితిలో ఉన్న యువతిపై మొదట ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేయగా, […]</p>

దిశ,వెబ్ డెస్క్: దేశంలో అమ్మాయిలకు రక్షణలేకుండా పోయింది. కామంతో కళ్లుమూసుకుపోయిన కొందరు దుండగులు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే త్రిపుర రాష్ట్రంలో వెలుగుచూసింది. కొవాయ్ జిల్లాలోని ఖాసియమంగల్ ఏరియాకి చెందిన 17 ఏళ్ల యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించిన కామాంధులు ఆమెను కిడ్నాప్ చేశారు.. బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు..
అడవిలో నిస్సహాయ స్థితిలో ఉన్న యువతిపై మొదట ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేయగా, ఆ తర్వాత వారు మరో ఇద్దరికి ఫోన్ చేసి పిలిపించి అత్యాచారం చేయించారు. ఒకరి తర్వాత ఒకరు ఆ యువతికి నరకం చూపించారు. విషయం బయటకు తెలియడంతో స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న మొత్తం 10మందిని అరెస్ట్ చేశారు. మైనర్‌ను గ్యాంగ్ రేప్ చేసిన ఐదుగురితో పాటు వారికి సహకరించిన మరో ఐదుగురిని కూడా జైలుకు పంపారు.






