రిలీజ్‌కు ముందే రికార్డులు బ్రేక్ చేసిన మాలీవుడ్ ఫిల్మ్.. ఎన్ని కోట్లో తెలుసా?

173
Minnal Murali

దిశ, సినిమా : మలయాళీ ఫస్ట్ సూపర్ హీరో ఫిల్మ్ ‘మిన్నల్ మురళి’ స్ట్రీమింగ్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. గత నెలలోనే ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది కానీ ‘మిన్నల్ మురళి’ కొత్తగా మాలీవుడ్ ఫిల్మ్స్ ఓటీటీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన క్రైమ్ డ్రామా ‘మాలిక్’ రికార్డులను బ్రేక్ చేసింది. నెట్‌ఫ్లిక్స్ రూ.37 కోట్లకు స్ట్రీమింగ్ రైట్స్ పొందడంతో.. మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ స్ట్రీమింగ్ రైట్స్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా టొవినో థామస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ముందు జూలైలో థియేటర్స్‌లోనే విడుదల చేద్దామని ప్రయత్నించిన మేకర్స్.. కరోనా సెకండ్ వేవ్, కేరళలో ప్రజెంట్ సిచ్యువేషన్స్ దృష్టిలో పెట్టుకుని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు మొగ్గుచూపారు. కాగా డిసెంబర్ 24న నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రాబోతున్న సినిమా కథ యంగ్ టైలర్ చుట్టూ తిరుగుతుంది. అనుకోకుండా సూపర్ పవర్స్ పొందిన హీరో.. విలేజ్ కోసం ఏం చేశాడు? అనేది కథ కాగా ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌కు బెస్ట్ రెస్పాన్స్ వచ్చింది.