- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి ఎర్రబెల్లి పెద్ద మనసు
<p>దిశ, వరంగల్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సాయం కోసం ఎదురు చూస్తున్న తల్లీబిడ్డల పట్ల ఆదరణ చూపాడు. హైదరాబాద్ నుంచి వచ్చి పున్నేలు గ్రామంలో చిక్కుపడిన ఓ తల్లి, ఇద్దరు పిల్లల ను వారి గమ్య స్థానాలకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. మంత్రి గురువారం ఉదయం వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి నుంచి వరంగల్ కు వెళుతుండగా మార్గమధ్యం లో పున్నెల్ క్రాస్ దగ్గర ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి బస్టాప్ వద్ద […]</p>

దిశ, వరంగల్
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సాయం కోసం ఎదురు చూస్తున్న తల్లీబిడ్డల పట్ల ఆదరణ చూపాడు.
హైదరాబాద్ నుంచి వచ్చి పున్నేలు గ్రామంలో చిక్కుపడిన ఓ తల్లి, ఇద్దరు పిల్లల ను వారి గమ్య స్థానాలకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. మంత్రి గురువారం ఉదయం వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి నుంచి వరంగల్ కు వెళుతుండగా మార్గమధ్యం లో పున్నెల్ క్రాస్ దగ్గర ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి బస్టాప్ వద్ద నిలబడి కనిపించింది. వారిని గమనించిన మంత్రి
బస్టాప్ వద్దకు వెళ్లి పలకరించి వివరాలు తెలుసుకున్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నుంచి తమ బంధువుల ఊరు పున్నెలు కు వచ్చానని, కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటనతో అదే గ్రామంలో ఉండిపోయాయని పేర్కొంది. స్పందించిన మంత్రి వెంటనే వారిని గమ్య స్థానానికి చేర్చాలని అందుబాటులో ఉన్న అధికారులు, పోలీస్ లను ఆదేశించారు. దీంతో ఆ మహిళ, మంత్రికి ధన్యవాదాలు తెలిపింది.
Tags: Minister Errabelli,mandatemother ,children home, woman, minister






