హైవేపై వలస కార్మికులతో మంత్రి వేముల ముచ్చట్లు

by Shyam |

<p>దిశ, నిజామాబాద్: లాక్‎డౌన్ సడలింపుల నేపథ్యంలో తమ సొంతూళ్లకు ప్రయాణమైన వలస కార్మికులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముచ్చటించారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని శ్రీరాంపూర్ వద్ద హైవేపై ఉన్న వలస కార్మికుల బాగోగులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే, వారి భోజన సదుపాయాలపై ఆరా తీశారు. కాగా, గత మూడు రోజులుగా మంత్రి వేముల తన సొంత ఖర్చులతో వలస కార్మికులకు భోజనం పెట్టి రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా మహారాష్ట్ర బార్డర్ [&hellip;]</p>

హైవేపై వలస కార్మికులతో మంత్రి వేముల ముచ్చట్లు
X

దిశ, నిజామాబాద్: లాక్‎డౌన్ సడలింపుల నేపథ్యంలో తమ సొంతూళ్లకు ప్రయాణమైన వలస కార్మికులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముచ్చటించారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని శ్రీరాంపూర్ వద్ద హైవేపై ఉన్న వలస కార్మికుల బాగోగులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే, వారి భోజన సదుపాయాలపై ఆరా తీశారు. కాగా, గత మూడు రోజులుగా మంత్రి వేముల తన సొంత ఖర్చులతో వలస కార్మికులకు భోజనం పెట్టి రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా మహారాష్ట్ర బార్డర్ వరకు వలస కార్మికులను తరలిస్తున్నారు.

Next Story