రోడ్డు పనులను వేగంగా చేయాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

by Shyam |   (  Updated:2020-04-12 02:34:28  IST  )

<p>దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్-జడ్చర్ల రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌ను ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు ఆదివారం వస్తూ మార్గం మధ్యలో ఆగారు. రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును గుత్తేదారును అడిగి తెలుసుకున్నారు. మరో 15 రోజులు లాక్‌‌డౌన్ పెంచినందున, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ట్రాఫిక్ పెద్దగా ఉండదని, పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత [&hellip;]</p>

రోడ్డు పనులను వేగంగా చేయాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
X

దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్-జడ్చర్ల రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌ను ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు ఆదివారం వస్తూ మార్గం మధ్యలో ఆగారు. రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును గుత్తేదారును అడిగి తెలుసుకున్నారు. మరో 15 రోజులు లాక్‌‌డౌన్ పెంచినందున, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ట్రాఫిక్ పెద్దగా ఉండదని, పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించాలన్నారు.

Tags: Mahabubnagar, minister v.srinivas, road widening works

Next Story