- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న బీజేపీ నేతలు’
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేటలో సోమవారం రాత్రి జరిగిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇంట్లో డబ్బులు దొరికాయని పోలీసులు తేల్చి చెబుతుంటే.. ఆ డబ్బు పోలీసులే తీసుకొచ్చారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ అంశం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్న దుబ్బాక, సిద్దిపేట ఎపిసోడ్ చూశాం.. నిన్నటి డ్రామాలో జితేందర్ రావు ఇంట్లో సోదాలు జరిగాయి.. బీజేపీ నేతలకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేటలో సోమవారం రాత్రి జరిగిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇంట్లో డబ్బులు దొరికాయని పోలీసులు తేల్చి చెబుతుంటే.. ఆ డబ్బు పోలీసులే తీసుకొచ్చారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ అంశం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్న దుబ్బాక, సిద్దిపేట ఎపిసోడ్ చూశాం.. నిన్నటి డ్రామాలో జితేందర్ రావు ఇంట్లో సోదాలు జరిగాయి.. బీజేపీ నేతలకు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎంపీ బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెళ్లి నానా హంగామా చేశారు. పోలీసులు తనిఖీలు చేసి డబ్బులు స్వాధీనం చేసుకుంటే.. బీజేపీ నేతలు దౌర్జన్యంగా లాక్కొని వెళ్లారు’ అంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
Next Story






