వారికి క్షమాపణ చెప్పేందుకు సిద్ధం :తలసాని

155

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల అభివ‌ృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల కోకాపేటలో జరిగిన ముదిరాజ్ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో గంగపుత్రులను బాధపెట్టేలా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.

తన వ్యాఖ్యలు గంగపుత్రుల మనోభావాలు కించపరిచేలా ఉన్నాయని అనిపిస్తే.. వారికి క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కేసీఆర్ గంగ పుత్రులకు చెరువులు, కుంటలు మీద సర్వాధికారాలు ఇవ్వాలని అసెంబ్లీలో చెప్పిన విష‌యాన్నే తాను ప్రస్తావించానని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు గంగ‌పుత్రుల‌ను ప‌ట్టించుకునేవారే లేర‌ని తలసాని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చాక వారి సంక్షేమం కోసం కృషి చేస్తోంద‌ని తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..